మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాడట. మూడు సంవత్సరాల క్రితం 2019 జనవరిలో పుల్వామ దాడిలో 40మంది భారత జవాన్లు మరణించారు. అదే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడి చేసి గట్టిగా సమాధానం చెప్పింది. ఆ సమయంలో అభినందన్ వర్థమాన్ అనే ఎయిర్ వింగ్ కమాండర్ పాకిస్థాన్ పై దాడుల్లో పాల్గొని.. బోర్డర్ దాటి వీరోచితంగా పోరాడి..పాకిస్తాన్ యుద్దవిమానాన్ని కూల్చి.. వారికి దొరికిపోయారు. భారత్ సహా అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాక్.. అభినందన్ ను భారత్ కి అప్పగించింది. ఈ ఇన్ స్పైరింగ్ స్టోరీతో ఓ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ కథతో సినిమా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కాని అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ రియల్ స్టోరీని వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించాలని ఏర్పాట్లు చేస్తున్నారట.
ఈ మూవీలో అభినందన్ వర్ధమాన్ పాత్రలో వరుణ్ తేజ్ నటించనున్నారట. ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చేయడానికి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఘాజీ, అంతరిక్షం సినిమాల ఫేమ్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని టాక్ విపినిస్తుంది. వరుణ్ తేజ్ తో ఆయన ఆల్ రెడీ సినిమా చేసి..సక్సెస్ సాధించారు. మరో వైపు గరుడ వేగ లాంటి సక్సెస్ పుల్ సినిమాలు అందించిన ప్రవీణ్ సత్తార్ పేరు కూడా ఈ సినిమా కోసం వినిపిస్తుంది. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నారు ప్రవీణ్ సత్తారు. ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్ మూవీ చేస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని ఎవరు తెరకెక్కిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..