ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరంగా కానుంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జనవరి 27వ తేదీన ఎయిరిండియాను పూర్తిగా టాటా చేతుల్లో పెట్టనున్నారు. సంస్థకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం టాటా గ్రూప్‌నకు అప్పగించనున్నట్టు తెలిపింది. జనవరి 27 నుంచి ఎయిర్ ఇండియా నిర్వహణ టాటాలు అందుకోవడం జరుగుతుందని ఎయిర్ ఇండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాది సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారని తెలుస్తున్నది. ఎయిర్ ఇండియాతో రాకతో టాటా గ్రూప్‌లోకి మూడో విమానయాన బ్రాండ్ వచ్చినట్టు అయ్యింది. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియాలో టాటాసంస్థకు మెజార్టీ వాటాలు ఉన్నాయి.
అప్పుల ఊబిలో ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ.18వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 8న కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 11వ తేదీన బిడ్డింగ్‌ను ధృవీకరిస్తూ.. కేంద్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ మిగిలి ఉందని, ఇది రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్‌ను పారిశ్రామిక దిగ్గజం జేఆర్డీ టాటా స్థాపించగా.. స్వాతంత్య్రం తరువాత కేంద్ర దీన్ని జాతికి అంకింతం చేసింది. దీని పేరును ఎయిర్ ఇండియగా మార్చింది. 68 ఏళ్ల తరువాత మళ్లిd ఎయిర్ ఇండియా టాటా చేతికొచ్చింది.
ఐఏఎస్‌ఏటీఎస్‌లో 50శాతం వాటా
ఒప్పందంలో భాగంగా.. ఎయిర్ ఇండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఐఏఎస్‌ఏటీఎస్‌లో 50శాతం కూడా టాటా గ్రూప్‌కు దక్కనుంది. ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలని టాటా గ్రూప్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. 2007-08లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అనంతరం సంస్థకు నష్టాలు ప్రారంభం అయ్యాయి. ఫలితంగా అప్పులు పెరిగాయి. దీంతోనే ప్రైవేటీకరించాలని నిర్ణయించి.. ఒప్పందం పూర్తి చేసుకుంటున్నది.
టాటాకు చేతికి ఎయిరిండియా.. ముహూర్తం ఫిక్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement