కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాల్సిందేనని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని…అది ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోందన్నారు…వెంటనే మెరుగైన హెల్త్‌కేర్ వసతులు కల్పించండి…లేదంటే కరోనా కేసులను తగ్గించాలని స్పష్టం చేశారు. రోజూ ఇన్ని కేసులను భరించడం సాధ్యం కాదన్నారు. దీనికోసం కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రాణాలు కాపాడటం అనేది ముఖ్యం. కేసులు పెరిగిపోతుండటం వల్ల ఆరోగ్య వ్యవస్థ మూల్యం చెల్లించాల్సి వస్తోందని…ముందు కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించాలని నొక్కి చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement