తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నేతలు వరుసగా ఢిల్లీకి క్యూకడుతున్నారు. పార్టీ హైకమాండ్‌ని కలిసి చేరికల విషయంలో స్పష్టత తెచ్చే యత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు ఇవ్వాల (సోమవారం) పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీని కలిశారు. కాగా ఈ సాయంత్రం ఏఐసీసీ కూడా పార్టీలో చేరబోయే వారి జాబితాను రిలీజ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీలో మొత్తంగా 35 మంది చేరుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఇందులో తొలిపేరు జూపల్లి కృష్ణారావుది కాగా, 15 నెంబర్లో పొంగులేటి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఆదివారం ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరేందుకు పొంగులేటి యత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పొంగులేటి, జూపల్లి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో చేరికలు ఊపందుకున్నాయి. కీలక నేతల ఇళ్లకు వెళ్లి వారిని స్వయంగా కలిసి పార్టీలో చేరాల్సిందిగా కోరారు రేవంత్‌రెడ్డి. కోమటిరెడ్డి ఇంటితో మొదలైన రేవంత్ సమావేశాలు.. జూపల్లి, పొంగులేటి ఇంట్లో కూడా కొనసాగాయి. పొంగులేటి నివాసంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు చేశారు. ఇక.. రాహుల్‌గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.