Tuesday, November 26, 2024

అగ్నివీర్ ల్లో 75శాతం మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు గ్యారెంటీ – సీఎం మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్

నాలుగేళ్ల‌పాటు అగ్నివీర్ లుగా ప‌ని చేసి తిరిగి వ‌చ్చిన వారిలో 75శాతం మందికి రాష్ట్ర ప్ర‌భుత్వం గ్యారెంటీగా ఉద్యోగాలు ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్.. అగ్నివీర్ లు గ్రూప్ C ఉద్యోగాల కోసం ఏదైనా కేడర్‌లో చేరవచ్చు. లేకుంటే మాకు పోలీసు ఉద్యోగాలున్నాయి. వాళ్లకు అవి ఇస్తాం అని అన్నారు. కాగా ఈ అగ్నిప‌థ్ ప‌థ‌కం ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement