Tuesday, November 26, 2024

అగ్ని-పి ప‌రీక్ష విజ‌య‌వంతం : శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించిన రాజ్ నాథ్ సింగ్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్ నేడు అత్యాధునిక అగ్ని-పి బాలిస్టిక్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. ఈ క్షిప‌ణిని ముందు త‌రం క్షిప‌ణిగా డీఆర్డీవో అభివ‌ర్ణించింది. అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సత్తా దీని సొంతం.అగ్ని-పి పరీక్ష విజయవంతం కావడంతో డీఆర్డీవో శాస్త్రవేత్తలను దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. దీని రేంజి 1000 నుంచి 2000 కిలోమీటర్లు. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ఉదయం 11.06 గంటలకు గాల్లోకి దూసుకుపోయిన అగ్ని-పి పరీక్ష పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.

తూర్పు తీర ప్రాంతం పొడవునా ఏర్పాటు చేసిన వివిధ టెలీమెట్రీ వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ట్రోల ఆప్టికల్ కేంద్రాలు, యుద్ధ నౌకల సాయంతో ఈ మిసైల్ గమనాన్ని డీఆర్డీవో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. ఇందులోని కీలక వ్యవస్థల పనితీరు అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు. అగ్ని-పి రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి. దీంట్లో డ్యూయల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు పొందుపరిచారు. తాజా పరీక్ష ద్వారా ఇందులోని సాంకేతిక వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తున్నట్టు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement