అహ్మదాబాద్ స్టేడియంలో ఇవ్వాల (ఆదివారం) గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకోగా.. గుజరాత్ బ్యాటర్లు దంచికొట్టారు. సొంత మైదానంలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(94 నాటౌట్ : 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్ లు) వృద్ధిమాన్ సాహా(81 : 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ లు) చెలరేగారు. డేవిడ్ మిల్లర్(21 నాటౌట్) కూడా ధనాధన్ ఆడడంతో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఉతికారేసిన సాహా, గిల్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 142 పరుగుల భాగస్వామ్చం చేశారు.
ఇక.. 228 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో.. టార్గెట్ చేజింగ్‌లో అంత దూకుడు చూపలేదు. ఈ టీమ్‌లో మేయర్స్ (48), డీకాక్ (70) పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఆడలేకపోయారు. కాగా, దీపక్ హుడా (11), స్టోయినిస్ ( 4), పూరన్ (3), బదోని (21), కృనాల్ పాండ్యా (0) గా పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీతయ ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి లక్నో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 56 పరుగుల తేడాతో గుజరాత్ విజయకేతనం ఎగరేసింది.