Sunday, September 8, 2024

IPL | లక్నోపై దూకుడు.. గుజరాత్​ భారీ విజయం

అహ్మదాబాద్​ స్టేడియంలో ఇవ్వాల (ఆదివారం) గుజ‌రాత్ టైటాన్స్, లక్నో సూపర్​ జెయింట్స్​ జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. టాస్​ గెలిచిన లక్నో ఫీల్డింగ్​ ఎంచుకోగా.. గుజరాత్​ బ్యాట‌ర్లు దంచికొట్టారు. సొంత మైదానంలో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(94 నాటౌట్ : 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్ లు) వృద్ధిమాన్ సాహా(81 : 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ లు) చెల‌రేగారు. డేవిడ్ మిల్లర్(21 నాటౌట్) కూడా ధ‌నాధ‌న్ ఆడ‌డంతో గుజ‌రాత్ 2 వికెట్ల న‌ష్టానికి 227 ప‌రుగుల భారీ స్కోరు చేయగలిగింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్లను ఉతికారేసిన సాహా, గిల్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 142 ప‌రుగుల భాగస్వామ్చం చేశారు.

 

ఇక.. 228 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన లక్నో.. టార్గెట్​ చేజింగ్​లో అంత దూకుడు చూపలేదు. ఈ టీమ్​లో మేయర్స్​ (48), డీకాక్​ (70) పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఆడలేకపోయారు. కాగా, దీపక్​ హుడా (11), స్టోయినిస్​ ( 4), పూరన్​ (3), బదోని (21), కృనాల్​ పాండ్యా (0) గా పెవిలియన్​ చేరారు. దీంతో నిర్ణీతయ ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి లక్నో 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 56 పరుగుల తేడాతో గుజరాత్​ విజయకేతనం ఎగరేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement