- భారత పేసర్ల దూకుడు.. తక్కువ స్కోరుకే ఐర్లండ్ ఆలౌట్
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దూకుడు కనబరిచింది. తొలుత టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ఐర్లాండ్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ఐర్లాండ్ జట్టు కేవలం 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇందులో భారత పేసర్లు చెలరేగిపోయారు.
ఇక. 97 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగన భారత జట్టులో విరాట్, రోహిత్ ఓపెనర్లుగా వచ్చారు. కాగా, ఒకే ఒక్క పరుగు చేసి కోహ్లీ లాంగాఫ్ మీదుగా సిక్స్ బాదబోయి క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రోహిత్‌కు జతగా రిషబ్ పంత్ జత అయ్యాడు. ఇద్దరూ కలిసి దూడుకు మీదుండగా.. కెప్టెన్ రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతలోనే ఓ బంతి రోహిత్ మోచితికి తాకడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో సూర్యకుమార్ వచ్చి రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత శివమ్ దూబేతో కలిసి పంత్ బౌండరీలు బాది ఆట ముగించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 52, కోహ్లీ (1), రిషబ్ పంత్ 36, సూర్యకుమార్ (2), శివమ్ దూబె 0.. పరుగులు సాధించారు.
కాగా, అంతకుముందు..
ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.. కాగా, ఐర్లాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలాకాలం తర్వాత బంతితో ఇరగదీశాడు. మూడు వికెట్లు తీసి భేష్ అనిపించుకున్నాడు.
ఇక.. హార్దిక్ దాటికి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. హార్దిక్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. హార్దిక్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ (3-0-18-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (2-1-4-1), అక్షర్ పటేల్ (0.2-0-1-1) కూడా విజృంభించడంతో ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), లోర్కాన్ టక్కర్ (10), హ్యారీ టెక్టార్ (4), కర్టిస్ క్యాంపర్ (12), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.