ఓ మరాఠీ చిత్రంలో చిన్నారులతో అసభ్య దృశ్యాలను చిత్రీకరించినందుకు ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ పై కేసు నమోదయింది. కాగా ముంబైలోని మహిమ్ పోలీసు స్టేషన్లో ఈ కేసుని బుక్ చేశారు పోలీసులు. ఐపీసీ 292, 34 సెక్షన్లతో పాటు పోక్సో సెక్షన్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు నమోదు చేశారు. సీమా దేశ్పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement