Saturday, November 23, 2024

పంజాబ్ సీఎంపై – న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప్ర‌సంశ‌లు – ఆప్ లో చేర‌నున్నారా !

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాగా ఈ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాల‌ని ఐదు రాష్ట్రాల పార్టీ చీఫ్ ల‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. కాగా ఆమె ప్ర‌క‌టించిన త‌ర్వాతి రోజే సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ప్రశంసలు కురిపిస్తూనే పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. పెద్దగా అంచనాల్లేని, ఎవరి వద్దా ఏమీ ఆశించని వ్యక్తులే ఆనందపరులు. ఇప్పుడు కొండంత ఆశలు, అంచనాలతో పంజాబ్ లో మాఫియా వ్యతిరేక యుగాన్ని భగవంత్ మాన్ ప్రారంభించారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఆయన పైకి ఎదుగుతారని ఆశిస్తున్నా. ప్రజాకర్షక పథకాలతో పంజాబ్ కు మళ్లీ పునర్వైభవం తెస్తారని అనుకుంటున్నా’’ అని పేర్కొంటూ సిద్ధూ ట్వీట్ చేశారు.దాంతో న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్ లో చేరే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement