Tuesday, November 26, 2024

రాందేవ్ బాబాకు షాక్.. కరోనిల్‌పై నేపాల్ నిషేధం

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ కరోనా కోసం తీసుకొచ్చిన కరోనిల్ మందుకు పంపిణీని నేపాల్ నిలిపివేసింది. ఇప్పటికే భూటాన్ ఈ మందుపై నిషేధం విధించగా తాజాగా, నేపాల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. కరోనా వైరస్‌ను నివారించడంలో కరోనిల్ విఫలమైందని, కాబట్టి రాందేవ్ బాబా బహుమతిగా పంపిన 1,500 కిట్లను వాడకూడదని నేపాల్ నిర్ణయించింది. కరోనా కిట్‌లోని ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని పేర్కొన్న నేపాల్ ఆయుర్వేద మంత్రిత్వశాఖ కరోనిల్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పతంజలి ఉత్పత్తులపై అధికారిక నిషేధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో పతంజలి ఆయుర్వేద ఆధారిత కరోనిల్‌పై నేపాల్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక నిషేధ ఉత్తర్వులు జారీ చేయలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. నేపాల్ ప్రభుత్వం దేశంలో కరోనిల్‌ను నిషేధించిందన్న మీడియా వార్తలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ కృష్ణ ప్రసాద్ పౌడియల్ ఖండించారు.

ఇదీ చదవండి: ఢిల్లీకి జగన్.. అమిత్ షా అపాయింట్‌మెంట్ ఫిక్స్?

Advertisement

తాజా వార్తలు

Advertisement