Friday, November 22, 2024

శునకానికి బేరియాట్రిక్ సర్జరీ.. ఖర్చు ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగునా సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, కుక్క అధిక బరువుతో ఉంటే, అది దాని ఆయుష్షును గణనీయంగా తగ్గిస్తుంది. అధిక బరువు ఉన్న ఓ శునకానికి బేరియాట్రిక్ సర్జరీ చేశారు. దేశంలోనే తొలిసారి పూణెలో ఆపరేషన్ చేశారు.  

మహారాష్ట్రలోని పూణెకి చెందిన డైసీ దారువాలా అనే మహిళ ‘దీపిక’ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. దీని వయసు 7 ఏళ్లు. ఇది రోజురోజుకు బరువు పెరిగిపోయి ఏకంగా 50 కిలోలకు చేరుకుంది. దీంతో కిడ్నీ, కార్డియాక్, లివర్,  హై బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. అంతేకాదు అది నడవడానికి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. దీంతో ఆందోళన చెందిన యాస్మిన్ జంతు వైద్య నిపుణులను ఆశ్రయించారు. ‘దీపిక’ను పరీక్షించిన నిపుణులు దానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించాలని సూచించారు. శునకం బరువు తగ్గి సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు.

ఈ శునకానికి రూ. 1.20 లక్షల ఖర్చుతో ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ చేశారు. శునకానికి ఆపరేషన్ చేసిన వైద్యులు దానిలో పేరుకుపోయి 5 కిలోల అదనపు కొవ్వును తొలగించారు. దీంతో ఆ శునకం బరువు 45 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం నడవగలుగుతోందని దీపిక యాజమాని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement