శ్రద్ధా వాల్కర్‌ను అతి కిరాతకంగా అంతమొందించిన అఫ్తాబ్‌ను పోలీసులు సైకో కిల్లర్‌గా భావిస్తున్నారు. అతని మానసిక స్థితిపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. ప్రియురాలిని హత్య చేయడం దగ్గర్నుంచి, మృతదేహాన్ని ముక్కలు చేయడం, ఫ్రిజ్‌లో దాచడం, ఆ తర్వాత శరీర భాగాలను విడతల వారీగా అటవీ ప్రాంతంలో పడేయడం దాకా వరుస పరిణామాల్ని విశ్లేషిస్తే ఇదొక భిన్నమైన కేసుగా కనిపించింది. ప్రాథమిక దర్యాప్తులో అనేక కోణాలను గుర్తించిన పోలీసులకు అతని ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటాలో మరొక ఆసక్తికర అంశం లభించింది. వింతవింత హత్య ఘటల్ని అఫ్తాబ్ శోధించినట్లు వెల్లడైంది. డెహ్రాడూన్‌కు ఛెందిన అనుపమ గులాటీ హత్య కేసును కూడా అతను క్షుణ్ణంగా చదివాడని, అదే తరహాలో శ్రద్ధాను హతమార్చి, మృతదేహాన్ని మాయం చేశాడని బుధవారం పోలీసులు తెలిపారు.
అనుపమ గులాటీ కేసులోనూ బాధితురాలి తల్లిదండ్రులు అన్వేషణతోనే హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. అనుపమ హత్య ఘటనను ఆమె భర్త రాజీవ్ గులాటీ రెండు నెలలు దాచివుంచాడు. మృతదేహాన్ని 70 ముక్కలు చేసి, మూడు నెలలు ఫ్రిజ్‌లో దాచివుంచి, ఆ తర్వాత సమీపంలోని హిల్‌స్టేషన్ ముస్సోరి అరణ్యాలలో పడేశాడు. అఫ్తాబ్ కూడా ఇదే విధంగా వ్యవహరించాడు. ఎవరికీ అనమానం రాకుండా మృతదేహం ఫ్రిజ్‌లో ఉండగానే మరొకరితో డేటింగ్ చేశాడు. డెహ్రాడూన్ కిల్లర్ నుంచి అఫ్తాబ్ స్పూర్తి పొందగా, హాలీవుడ్ కల్పిత గాథల నుంచి రాజీవ్ గులాటీ ప్రేరణ పొందాడు. ప్రత్యేకంగా హాలీవుడ్ సినిమాలను అతను బాగా చూసేవాడని తేలింది. తన భార్య లాగే ఆమె సోదరుడితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆమె క్షేమంగా ఉన్నట్లు రాజేశ్ గులాటీ నమ్మించాడు. అఫ్తాబ్ కూడా ఇలాగే చేశాడు. ప్రియురాలి ఇన్‌స్టా ఖాతా ద్వారా ఆమె స్నేహితులతో చాట్ చేస్తూ వచ్చాడు. కానీ అతడి వ్యూహం బెడిసి కొట్టింది. శ్రద్ధ ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆమె స్నేహితులకు అనుమానం కలిగింది. దీంతో మిస్టరీ కోణం బహిర్గతమైంది.
అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు
సహజీవన ప్రియురాలు శ్రద్ధా వాల్కర్‌ను చంపిన కిల్లర్ అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు ఢిల్లి పోలీసులు నార్కో పరీక్షలు చేయనున్నారు. అఫ్తాబ్ చెప్పేదాంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకునేందుకు అతనికి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విచారణ సమయంలో హంతకుడు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా నిందితుడి మానసిక స్థితిని అంచనా వేయనున్నారు. ఢిల్లిలోని సాకేత్ కోర్టు.. నార్కో పరీక్ష నిర్వ#హంచేందుకు అనుమతి ఇచ్చింది. శ్రద్ధా ఫోన్‌ను ఏం చేశాడు, ఆమెను ముక్కలుగా నరికేందుకు వాడిన కత్తి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అఫ్తాబ్ మానసికంగా సరిగా లేకుంటే అప్పుడు ఏం చేయాలో కూడా పోలీసులు ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. గతంలో కూడా ఢిల్లి పోలీసులు సైకో అనాలసిస్ పరీక్షలు నిర్వ#హంచారు. గత ఏడాది ఇజ్రాయిల్ ఎంబసీ బ్లాస్ట్ కేసులో అరెస్టు అయిన నలుగురిపై సైకో అనాలసిస్ పరీక్షలు చేశారు. దాని ద్వారా వాళ్లు పాక్షికంగా మాత్రమే నిజం చెబుతున్నట్లు గుర్తించారు.