పులిని చూడటం అంటే మాటలా చెప్పండి. అది కూడా అతి దగ్గరగా అంటే గుండె కొట్టుకునే వేగం పెరగాల్సిందే. అయితే ఓ వ్యక్తి పులితో కలిసి సెల్ఫీని తీసుకోవాలనుకున్నాడు.. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆఫ్రికాలోని ఓ సఫారీలో చిరుతపులులు ఉండే అడవిలోకి టూరిస్టులను జీపులో తీసుకెళ్లారు గైడ్స్. చిరుతపులులకు కాస్త దగ్గరిలో జీపును ఆపి… వాటిని చూడమన్నారు. ఐతే… టూరిస్టులు ప్రశాంతంగా ఉండరు కదా… కాస్త హడావుడి, కేరింతలు కొట్టారు. దాంతో చిరుతపులుల దృష్టి జీపుపై పడింది. ఓ చిరుత చాలా యాక్టివ్‌గా ఉండి… గబగబా వచ్చి జీపు టాప్ ఎక్కింది. ఆ సమయంలో లోపలున్న టూరిస్టులు ఊపిరి బిగపట్టి… నెక్ట్స్ ఏం చేస్తుందో అని భయపడుతూ చూడసాగారు. గైడ్లు సైలెంట్‌గా ఉండమని టూరిస్టులకు చెప్పారు.
ఓ యువకుడు… ఆ చిరుతను చూడగానే దానితో సెల్ఫీ తీసుకోవాలి అనుకున్నాడు. వెంటనే తన సీటు నుంచి పైకి లేచి… కూర్చొని ఉన్న చిరుత పక్కన నిలబడి సెల్ఫీ కోసం యత్నించాడు. అంతలోనే అతనివైపు తిరిగిన చిరుత కోపంగా చూసింది. హడలిపోతూనే అతను సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి… మొత్తానికి తీసుకున్నాడు. అది చూసిన లోపలి ఇతర టూరిస్టులు… విపరీతంగా భయపడ్డారు. ఓ అమ్మాయి అయితే టెన్షన్‌తో కళ్లు మూసేసుకుంది. అతని అదృష్టం బాగుంది కాబట్టి బతికి బట్టకట్టాడు. లేదంటే పులికి బలి అయ్యేవాడే. అయినా ఇలాంటి భయంకర సాహసాలు చేయవద్దని సూచిస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital
https://www.facebook.com/prakash.agrawal.73/videos/608287303556755/?t=1