Saturday, November 23, 2024

వీధుల్లో ఆహారం అమ్ముతోన్న జ‌ర్న‌లిస్ట్ – తాలిబ‌న్ల ఆగ‌డాల‌కి అంతేలేదా..!

తాలిబ‌న్లు ఆఫ్ఘానిస్థాన్ ని చేజిక్కుంచుకున్ప‌టి నుంచి అక్క‌డ వారి జీవ‌న విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆడ‌వారి విష‌యంలో క‌ఠిన ఆంక్ష‌లు విధించారు తాలిబ‌న్లు. కాగా ఓ జ‌ర్న‌లిస్టు వీధుల్లో ఆహారం అమ్ముకునే ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. తాలిబన్లు ఆఫ్ఘ‌న్ ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారాయి. అంతర్జాతీయ సహాయాన్ని కోల్పోవడం, పెరుగుతున్న వ్యయాలు, అధిక నిరుద్యోగిత రేటు ప్రపంచ బ్యాంకు ‘భయంకరమైన’ పరిస్థితికి దారితీసింది. ఆఫ్ఘన్ జర్నలిస్ట్ మూసా మొహమ్మదీ ఓ ఫోటోను షేర్ చేశారు. కొన్నాళ్లుగా మీడియా రంగంలో భాగమైన ఆయన ఇప్పుడు వీధి ఆహారాన్ని అమ్ముతున్నారు. జర్నలిస్ట్‌గా జీవితకాలం పని, పోరాటాలు చేసిన ప్రతిభావంతులైన యువతరం భవిష్యత్ ఇలా ముగుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కబీర్ హక్మల్, ఆఫ్ఘనిస్తాన్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి కూడా మొహమ్మదీ గురించి ట్వీట్ చేశారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలకు తాలిబాన్‌లను నిందించారు.

ఈ ఘటన రేడియో టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వచ్చింది. తన డిపార్ట్‌మెంట్‌లో టీవీ యాంకర్, రిపోర్టర్‌ను నియమిస్తానని వాసిక్ ఒక ట్వీట్‌లో తెలిపారు. గత ఆగస్టులో తాలిబాన్ అఘ్షనిస్తాన్ స్వాధీనం చేసుకున్నప్పటీ నుంచి ఆ దేశంం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాలిబాన్ దళాలు మీడియా సంస్థలపై విరుచుకుపడ్డాయి. గత కొన్ని నెలలుగా అనేక మంది జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.. ప్రపంచ బ్యాంకు ప్రకారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 2022లో మరింత క్షీణిస్తుందని అంచనా. 2020 -2022 ముగింపు మధ్య తలసరి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 30 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. అయినా తాలిబ‌న్లు వెన‌క్కి త‌గ్గట్లేదు..వారి మొండి వైఖ‌రి కార‌ణం అక్క‌డి ప్ర‌జ‌లు ఎన్నో ఇక్క‌ట్ల‌కి గుర‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement