హైదరాబాద్‌లో కల్తీ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తూ ఓ ముఠా పట్టుబడగా తాజాగా కేకులు, స్వీట్లు తయారు చేస్తూ అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు .. దీంతో ఏం తినాలన్నా భయపడుతున్నారు. ఇటీవల ఇటువంటి దందాలు వెలుగు చూడటంతో నగరంలో కల్తీ పదార్థాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కల్తీ కేక్‌లు తయారు చేస్తున్న ముఠాపై ఎస్‌వోటీ బాలానగర్ పోలీసులు దాడి చేశారు. బాచుపల్లి పరిధిలోని నిజాంపేటలోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో కల్తీ కేకులు తయారు చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేశారు. కేకుల తయారీలో రసాయన రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. యజమాని గోపాల కృష్ణ పరారీలో ఉండగా, అక్కడ పనిచేస్తున్న సయ్యద్ వాసిఫ్‌తో పాటు కేక్ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే పాతబస్తీ మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని లాల్ దర్వాజలోని ఓ ఇంట్లో కల్తీ పదార్థాలతో కలాకండ్, కోవా తదితర స్వీట్లను తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం బాల్ గోపాల్ యోజన కింద అందిస్తున్న పాల పొడిని తెలంగాణకి అక్రమంగాకి తరలించి వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.