తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. తెలంగాణలోని ఆదివాసీల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. జోడేఘాట్‌లో కుమ్రం భీం మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం జిల్లా అని నామకరణం చేశామన్నారు. గూడెంలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ది ఆదివాసీల కళను సీఎం కేసీఆర్ తీర్చారని పేర్కొన్నారు.
ఆదివాసీ భవన్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం.. మంత్రి కేటీఆర్ ట్వీట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement