Tuesday, January 7, 2025

Adilabad – వినోదాన్ని పంచే విహంగాలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ఆంధ్రప్రభ) :గలగల పారే జలసవ్వడులు.. మనసు దోచే సప్తవర్ణాల విహంగాలు… ప్రకృతి సమతుల్యతకు నెలవైన పచ్చని ఆదిలాబాద్ అడవులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అరుదైన పక్షులకు అలవాలమైన అదిలాబాద్ జిల్లాలో సుమారు 450 కి పైగా పక్షి జాతులను గుర్తించారు.

భూమ్మీద మనుషులు పుట్టకముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. నేలపై సంచరించే వన్యప్రాణులు ఆవాసం దొరక్క అంతరించిపోతుండగా గాలిలో హాయిగా తెలియాడే వివిధ రకాల విహంగాలు ప్రకృతి సమతుల్యతతో పాటు జీవవైవిద్యాన్ని కాపాడుతున్నాయి. విభిన్న రకాల విదేశీ పక్షుల సందడి..ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ని కవ్వాల్, పెంచికల్పేట్, కోసాయి,

- Advertisement -

జన్నారం, కుంటాల, నిర్మల్ అటవీ ప్రాంతాల్లో శీతాకాలంలో విదేశీ వలస పక్షులు సందడి చేస్తాయి. చుట్టూరా జీవనదులు, పచ్చని అడవుల మధ్య వివిధ ప్రాంతాలు తిరుగుతూ వాటికి అనువైన చోట ఆవాసం ఏర్పరచుకుంటున్నాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కో సాయి ఉoడం అడవుల్లో అరుదైన విదేశాలకు చెందిన ..రెడ్ క్రస్టేడ్ పో చార్డ్స్, రెడ్ వింగ్ స్టిల్స్, వైట్ త్రోటేడ్ కింగ్ ఫిషర్స్, జంగల్ లార్జ్ బబ్లర్, పెంటెడ్ స్టార్క్ పిజియన్స్, బార్ హేడేడ్ గూస్ తదితర విదేశీ పక్షులు పర్యాటికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి

. కొన్ని జాతులు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని మునుగడ సాగిస్తున్నాయి. ఎక్కువగా నైజీరియన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సైబీరియన్ పక్షులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విడిది చేస్తున్నాయి. పర్యాటకులు వీటిని చూస్తూ కొత్త అనుభూతి పొందుతున్నారు. ఇక్కడి అడవుల్లో రామచిలుకల కిలకిల రావాలు మనసు దోచి పెడుతున్నాయి. పక్షులు సొంతగా ఏర్పాటు చేసుకునే గిజిగాడు గూళ్ళు వాటి జీవన మనుగడకు అద్దo పడతాయి.

కవ్వాల్‌లో ఆకట్టుకుంటున్న బటర్‌ఫ్లై గార్డెన్..పెద్దపులలుకు ఆవాసమైన కవ్వాల్ అభయారణ్యంలో ఒక పెద్దపులి ఆనవాళ్లు కనిపించకపోగా, వివిధ రకాల పక్షులు కవ్వాల్ లో కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ 300 రకాల పక్షి జాతులకు అలవాలంగా మారింది. కవ్వాల్ లో ఏర్పాటుచేసిన వివిధ రకాల బటర్ ఫ్లై గార్డెన్ లో పక్షుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సీతాకోకచిలుకలు సందర్శించేందుకు జనం తరలి వస్తున్నారు.

జన్నారం డివిజన్లో వివిధ రకాల పక్షుల ఆవాసం, కొసాయి అడవుల్లో విదేశీ వలస జాతి పక్షుల కోసం ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా (ఐబీఎం) ఏర్పాటు చేయాలని పక్షి జాతుల ప్రేమికుడు లింగంపల్లి కృష్ణ ఆంధ్రప్రభకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement