Saturday, November 23, 2024

అధికార మదం.. ఎమ్మెల్యే కుమారుడు, అతని ఫ్రెండ్స్ కలిసి 16ఏళ్ల బాలికను..

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జోహరీ లాల్ మీనా కుమారుడు, మరో నలుగురిపై కేసు నమోదైంది. ఆ దుండగులను ఉరి తీయాలని ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన బాలిక కోరుకుంది. వారిని వదిలేయడం అంటే మరో నేరం చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుంది.. అందుకని వారిని వదిలేయకూడదని వేడుకుంది. ఈ ఘటనను వివరిస్తూ “ఫేస్‌బుక్ ద్వారా నాకు వివేక్ (నిందితుల్లో ఒకరైన) పరిచయం ఏర్పడింది. స్కూల్లో నాతో పాటు ఉన్న ఓ అమ్మాయికి అతను సోదరుడు. అతను నన్ను దీపక్ మీనాకు [కాంగ్రెస్ ఎమ్మెల్యే జోహరీ లాల్ మీనా కుమారుడు] పరిచయం చేశాడు. నిందితులు నన్ను నేరం జరిగిన హోటల్‌కు తీసుకెళ్లారు. నన్ను హోటల్‌లో వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు.

ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించి నిందితులు రూ.15 లక్షల నగదు, నగలు లాక్కెళ్లారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బు ఆ అమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టినట్టు వారు తెలిపారు. అంతేకాకుండా పోలీసులు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. నిందితులు కుటుంబాన్ని పరోక్షంగా బెదిరిస్తున్నారని, గత ఏడాది డబ్బు మాయమైనప్పుడు దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు కూడా అణచివేసేందుకు చూశారని ఆరోపించారు.

నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR), రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు సోమవారం దౌసాలోని బాలికను పరామర్శించారు. ఎన్‌సీపీసీఆర్‌ పోలీసులు ఈ అంశంపై సరైన విచారణ చేయడం లేదని, విద్రోహ వ్యూహాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాలికతో మాట్లాడాము. తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసును నీరుగార్చేలా వ్యవహరించడం కనిపిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు అధికారి ఇప్పటివరకు మమ్మల్ని కలవలేదు అని NCPCR చీఫ్ ప్రియాంక్ కనూంగో చెప్పారు.

కాగా, ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. సెక్షన్ 164 కింద బాలిక వాంగ్మూలం నమోదు తీసుకున్నాం. మొత్తం విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో నిందితుడిని విచారించడంతో సహా ఏది అవసరమో అది చేస్తాం అని దౌసాలోని డిప్యూటీ ఎస్పీ దినేష్ శర్మ తెలిపారు.
సోమవారం దౌసాలోని మహువాలోని జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఇంతలో ఒక ఎమ్మెల్యే కొడుకు ప్రమేయంతో ఈ కేసు రాజకీయంగా మాటల యుద్ధానికి కూడా దారితీసింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ రాజస్థాన్‌కు రావడానికి రైలు టిక్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు రాజస్థాన్ బీజేపీ నాయకుడు జితేందర్ గోత్వాల్ చెప్పారు. అందువల్ల ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో శాంతిభద్రతలను స్వయంగా చూసే అవకాశం ఉంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ.. కేంద్రమంత్రి అమిత్ షా రాజస్థాన్‌కు వచ్చేందుకు చార్టర్డ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేయవచ్చని, రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చూస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement