Saturday, November 23, 2024

త‌న ట్రైన‌ర్ ని మోకాళ్ల‌పై నిల‌బెట్టుకున్న న‌టి ప్ర‌గ‌తి – వీడియో చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే

టాలీవుడ్ న‌టి ప్ర‌గ‌తి ఈ మ‌ధ్య‌కాలంలో వ‌ర్క్ వుట్ చేస్తోన్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కాగా రీసెంట్ గా అతి క‌ష్ట‌త‌ర‌మైన వ‌ర్కౌట్ ని చేసింది ఈ సీనియ‌ర్ న‌టి. ప్ర‌గ‌తి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకుంది, దీనిలో ఆమె గోడ‌కి ఆనుకుని మోకాళ్ల‌పై స‌గం కూర్చుని బ్యాలెన్స్ చేసింది. అంతేకాదు.. ఆమె ట్రైనర్ ఆమె కాళ్లపై నిలబడ్డాడు. ఆమె తన పోస్ట్‌కి క్యాప్షన్‌లో “మీరు వేల మంది ముందు అందంగా కనిపించాలంటే, మీరు ఎవ్వరి ముందు కూడా వేల మందిని అధిగమించాలని తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ ప్ర‌గ‌తిలో ఇంత స్ట్రెంత్ ఉందా అని ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=Gor9j-GiBCk&t=15s

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement