Friday, November 22, 2024

Green India Challenge: మొక్కను నాటిన పూజా హెగ్డే

మొక్కలు నాటండి – అందమైన ఈ భూమిని, సర్వజీవులను రక్షించాలని పిలుపునిస్తుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తుంది. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయిపట్టి మొక్కలు నాటిస్తుంది. ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పాల్గొంది. యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన హీరోయిన్ పూజాహెగ్డే.. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటారు. అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముక్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుందని చెప్పింది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుందని, అందుకే  ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని పూజా హెగ్డే కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement