Tuesday, November 26, 2024

మనీ లాండరింగ్​ కేసులో జాక్వెలిన్​కి​ ఊరట.. తాత్కాలిక బెయిల్​ ఉత్తర్వులు కొనసాగింపు!

200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఉరట లభించింది. ఢిల్లీలోని పటియాల హౌజ్​ కోర్టులో మంజూరైన తాత్కాలిక బెయిల్‌ను కోర్టు మరోసారి మంగళవారం వరకు పొడిగించింది. గతంలో జాక్వెలిన్​ ఫెర్నాండెజ్‌కు ముందస్తు రక్షణ కల్పించిన ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ మంగళవారం నాడు కోర్టు తన ఉత్తర్వును వెలువరించనుందని తెలిపారు.  

అయితే.. జాక్వెలిన్​ ఫెర్నాండెజ్‌కు డబ్బు కొరత లేనందున ఆమె దేశం విడిచి సులభంగా పారిపోవచ్చని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన వాదనల సందర్భంగా సినీ నటిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఆమె దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు విమానాశ్రయాలపై లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) జారీ చేసినట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. కానీ, ఎల్‌ఓసి జారీ చేసినప్పటికీ మీరు (ఈడీ) విచారణ సమయంలో జాక్వెలిన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు? ఇతర నిందితులు జైలులో ఉన్నారు. పిక్ అండ్ చాయిస్ విధానాన్ని ఎందుకు అవలంబిస్తారు అని న్యాయస్థానం దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది.

అయితే.. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయి చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని జాక్వెలిన్​ ఫెర్నాండెజ్ తనకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరింది. దీంతో50,000 వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆమెకు సెప్టెంబర్ 26న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను కోర్టు ఆగస్టు 31న ఆమోదించింది.  సినీ నటి జాక్వెలిన్​ని  కోర్టుకు హాజరు కావాలని కోరింది.

- Advertisement -

విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు సమన్లు ​​జారీ చేసిన జాక్వెలిన్​ ఫెర్నాండెజ్‌ను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో తొలిసారిగా నిందితురాలిగా చేర్చారు. ఏజెన్సీ మునుపటి ఛార్జ్ షీట్,  అనుబంధ ఛార్జిషీటులో ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. అయితే.. ఈ పత్రాలలో జాక్వెలిన్​ ఫెర్నాండెజ్,  తోటి నటి నోరా ఫతేహి నమోదు చేసిన వాంగ్మూలాల వివరాలను మాత్రమే పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement