కరోనా మహమ్మారి బాలీవుడ్ ను కలవరపెడుతోంది. ఇప్పటి కోవిడ్ కారణంగా పలువురు సినీ నటులు మృతి చెందారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నటుడు బిక్రమ్ జిత్ కన్వర్పాల్ కొవిడ్ తో శనివారం ఉదయం మరణించారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడ్డ బిక్రమ్ జిత్.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు అశోక్ పండిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
దాదాపు 18 ఏళ్ల పాటు పలు భాషల్లోని సినిమాల్లో నటించారు. ఆర్మీ మేజర్ గా రిటైర్ అయిన బ్రికమ్ జిత్.. 2003లో ‘పేజ్ 3’ సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాకెట్ సింగ్, ఆరక్షణ్, మర్డర్ 2, టూ స్టేట్స్, ద ఘాజీ ఎటాక్ తదితర చిత్రాలతో పాటు ఎన్నో టీవీ షోల్లో సహాయ పాత్రలు షోపించి, గుర్తింపు తెచ్చుకున్నారు.