బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బహిరంగ ముద్దు కేసులో ఊరట లభించింది. 15ఏళ్ల క్రితం బహిరంగ ముద్దు వివాదంలో శిల్పాశెట్టి నిందితురాలిగా కేసు నమోదయింది. ఈ వివాదంపై విచారణ జరిపిన కోర్టు ఆమె బాధితురాలని తెలిపింది. 2007లో రాజస్తాన్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే వేదికపై ఉన్న రిచర్డ్ గేర్.. శిల్పా శెట్టిని చూడగానే ఆమెకు అట్రాక్ట్ అయ్యి.. ఆమె చేతులను పట్టుకుని ముద్దులు పెట్టాడు. దీన్ని శిల్పా శెట్టి అడ్డుకోలేకపోయింది. అయితే ఈ విషయంపై ఆ సమయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.
రిచర్డ్ గేర్ తనతో అలా అనుచితంగ ప్రవర్తించినప్పుడు శిల్పా శెట్టి అడ్డుకోలేదంటూ ఆమెపై వ్యతిరేక ఆరోపణలు వచ్చాయి. దీంతో బహిరంగంగానే వీరిద్దరి ముద్దులు పెట్టుకున్నారంటూ ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. అయితే ముందుగా ఈ కేసును రాజస్థాన్ కోర్టులో విచారించగా.. ఆ తర్వాత శిల్పా శెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రో పాలిటన్ కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. తాజాగా ఈ కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం..శిల్పా శెట్టి బాధితురాలని తెలిపింది. అలాగే హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రధాన నిందితుడని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..