వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించింది. త్వరలోనే తెలంగాణ సర్కారుతో కలిసి ఈ సంస్థ పనిచేయనుంది. తెలంగాణలోని టైర్ -II పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో సేవలను అందించనుంది. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చిన మీ షో, దాని వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేనని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. దావోస్‌లో ఆయనతో సమావేశమై ఈ విషయంపై మంత్రి కేటీఆర్ చర్చించారు. మీ షో ఈ కామర్స్ సంస్థ తెలంగాణలో టీ సాట్ నెట్వర్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ లాంటి వివిధ ప్లాట్‌ఫాంలతోపాటు తెలంగాణ అంతటా టైర్-II ఐటీ హబ్‌లను ఉపయోగించుకుంటుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement