ఏపీలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఉంది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలోనూ విద్యుత్ కోతలు ఉన్నాయి. రోడ్లూ బాగోలేవని విమర్శలు చేశారు. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రోడ్లు బాగు పడ్డాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చని చురకలు అంటించారు. ఏపీలో పరిస్థితి బాగాలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించారేమోనని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజల ఆరోగ్య, సామాజిక భద్రత విషయంలోనూ.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వివరణగా నేను ఈ అంశాలు చెప్పడంలేదు.. వాస్తవాలను ప్రజలకు చెబుతున్నా అన్నారు.
కేటీఆర్ కి చురకలు – ఏపీలో విద్యుత్ కోతలు లేవ్ – మంత్రి పెద్దిరెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement