Friday, November 22, 2024

మోదీ, ఆర్ ఎస్ ఎస్ టార్గెట్‌గా యాక్ష‌న్స్‌.. పీఎఫ్ ఐ పార్టీపై కేంద్రం నిషేధం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)పై కేంద్ర హోంశాఖ కఠిన ఆంక్షలు విధించింది. పీఎఫ్‌ఐను చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల పీఎఫ్‌ఐ ఆఫీసులపై దాడులు జరిగాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు తేలడమే కాకుండా.. ప్రధాని మోదీ లక్ష్యంగా ఈ సంస్థ పనిచేసినట్టు అధికారులు గుర్తించారు.

నిన్న‌కూడా కర్నాటక వ్యాప్తంగా ఏకాలంలో మెరుపు దాడులు చేసిన అధికారులు.. 80 మంది పీఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు. ఆయా జిల్లా, తాలూకాల న్యాయమూర్తుల దగ్గర వారిని హాజరు పరిచి జైలుకు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ప్రత్యర్థులపై దాడులకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలను పరిగణలోనికి తీసుకున్న కేంద్రం.. PFIని చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తించింది.

ఇక‌.. అంతకుముందుపీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. అత్యధికంగా కేరళలో 22, మహారాష్ట్రలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో ఎన్‌ఐఏ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, ఉగ్రముఠాల్లో చేరేలా యువతను ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగుచూసింది.

కాగా, PFI పెద్ద కుట్రే చేసిన‌ట్టు ఎన్ ఐ ఏ ద‌ర్యాప్తుల్లో వెల్ల డ‌య్యింది. దేశంలోని ఆరెస్సెస్‌, బీజేపీ అగ్ర నేతలే టార్గెట్‌గా పన్నాగం పన్నిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగుచూస్తున్న తాజా విషయాలు విస్తుగొల్పుతున్నాయి. నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం పీఎఫ్‌ఐ టార్గెట్‌ లిస్ట్‌లో ఉందని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని ఈ సంస్థ ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. వీరిని టార్గెట్‌ చేసుకుని దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ, సంఘ్‌నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు నిర్వహించడం కలకలం రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement