తెలంగాణలో పౌష్టికాహార లోపంపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈమేరకు సంబంధిత శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ఆ శాఖ అధికారులకు ట్వీట్ చేశారు. ‘‘ఇది నోట్ చేసుకోండి. 40శాతం కమీషన్లతో అవినీతి మయంగా మారిన కర్నాటక, రేపిస్టులకు రెమిషన్ ఇచ్చిన గుజరాత్ వంటి రాష్ట్రాలతో మమ్మల్ని కంపేర్ చేయవద్దు. ఆ రాష్ట్రాల పాలన కంటే అన్ని రంగాలలో మేము చాలా బెటర్‌గా ఉన్నాం. 18 నెలల టైమ్ బాండ్‌తో యాక్షన్ ప్లాన్ స్వీకరిస్తున్నాం. ఆ తర్వాత పౌష్టికాహార లోపంపై వివరాలు అందజేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తొలుత.. తెలంగాణలో పౌష్టికాహార లోపం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికైతే ఎక్కువకాలం పాలించిన వారిలో మీరే ఉన్నారు. మీరు నిజంగా ఒక సూపర్ స్టార్ లీడర్. మరి ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని దీన్ని ఎలా అధిగమిస్తారు అన్న ఓ నెటిజన్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘దయచేసి మీ రాష్ట్రంలో పోషకాహార లోపంపై డేటాను మాకు చూపించండి. మీరు ముందు ముందు ఏం చేస్తారో తెలియజేయండి. ప్లీజ్ NFHS-5లోని డేటాను ఇతరులకు సూచించకుండా చర్య తీసుకోండి’’.. అని మోహన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ ‘‘చాలెంజ్ యాక్సెప్టెడ్’’ అని రీ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. అప్పటికప్పుడు దీనిపై కార్యాచరణ ప్రకటించారు మంత్రి కేటీఆర్.