Monday, November 25, 2024

స‌మంత పంచ్ ఇస్తే – మామూలుగా ఉండ‌దు

రెగ్యుల‌ర్ ఫిట్ నెస్ ఫ్రీక్ ఎవ‌రంటే టాలీవుడ్ లో స‌మంత పేరు కూడా ఒక‌ట‌నే చెప్పాలి. ఈ విషయాన్ని సమంత స్వయంగా ఓ సందర్భంలో రివీల్ చేసింది. నేను బరువులు ఎక్కువగా ఎత్తుతాను. అలాగని యానిమల్ ప్రొటీన్ తీసుకోను. వెజిటబుల్స్ తీసుకుంటా.. పచ్చదనం(గ్రీన్) నిండిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతాను. మార్నింగ్ రొటీన్ ప్రొటీన్ షేక్స్ తీసుకుంటాను. వీటితో పాటే నిరంతరం నీళ్లు తాగుతాను అని టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. జిమ్ కి వెళ్లే ముందు.. గుడ్డు బట్టర్ వంటివి పరిమితంగా తింటాను. ఇక జిమ్ కి బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడు యోగా క్లాస్ లకి హాజరవుతుంది. మనసు ప్రశాంతత కోసం యోగా…ధ్యానంలో మునిగిపోతుంది. ఆ సమయంలో కూడా ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంది. నాన్ వెజ్ ప్రియురాలు అయినా ఫిట్ నెస్ ప్రీక్ అనిపించుకోవాలంటే నోరు కట్టుకోత తప్పదుగా. అలా వాటికి బ్రేక్ ఇస్తుంటుంది. తాజాగా సమంత కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో సమంత జిమ్ లో బాక్సింగ్ గాళ్ లుక్ లో కనిపిస్తుంది. టైట్ ఫిట్ దుస్తులు ధరించి చేతులకు గ్లౌజెస్ ధరించి టార్గెట్ ని ఫిక్స్ చేసి పంచ్ పవర్ విసరడానికి పోజిషన్ లో నిలబడి ఉంది. చేతలు రెండు టైట్ చేసి వేళ్లని పిడికిలో మడిచి పంచ్ ఇవ్వబోతుంది. ఈ క్రమంలో సమంత చేతి కండరాలు గట్టి పడటాన్ని గమనించ వచ్చు. ఈ ఫోటోని ఉద్దేశించి ఫైట్ మోడ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుఈ ఫోటో సమంత అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. బ్యాకెండ్ లో వాల్ కి ఇద్దరు ఫిట్ నెస్ మాయగాళ్ల ఫోటో ప్రేమ్ లో చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement