Thursday, November 21, 2024

ఆచార్య కోసం ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని న‌టించా – రామ్ చ‌ర‌ణ్

ఆచార్య క‌థ విన్న‌ప్పుడే ఆ పాత్ర నాకు బాగా వంట బ‌ట్టిందని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అన్నారు. కొర‌టాల‌ శివ స్క్రిప్ట్ రాసుకునేట‌ప్పుడే ఆయ‌న కూడా ఆ పాత్ర‌ను న‌ర‌న‌రాల్లో ఎక్కించేసుకున్నారు. రాజ‌మౌళి చెప్పిన‌ట్లు నేను ఆర్ఆర్ఆర్ నుంచి ఆచార్య షూటింగుకు ఒక ఖాళీ కాగితంలా వెళ్లాను. ద‌ర్శ‌కుల ద్వారా ఆయా సినిమాల పాత్ర‌లు అర్థం చేసుకుని ఆ పాత్ర‌ల్లో లీన‌మైపోతాను. పాత్ర‌ల‌ను అర్థం చేసుకోగ‌లిగితే వాటిని ఒంట‌బ‌ట్టించుకుంటాం. వేరే సినిమాల్లో చాలా క‌ష్ట‌ప‌డి న‌టించాల్సి వ‌స్తుంది. కొర‌టాల శివ వంటి ద‌ర్శ‌కుల స్క్రిప్ట్ లో చాలా బ‌లం ఉంటుంది. పాత్ర‌ల్లో న‌టించ‌డం సుల‌భం అవుతుంది. నా హిట్ సినిమాల‌న్నింటిలోనూ ఈ అనుభ‌వాన్ని నేను చ‌విచూశాన‌న్నారు.తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టిస్తుస్తున్నందుకు ఒత్తిడిగా అనిపించిందా” అన్న రెండో ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ స్పందిస్తూ… ”కచ్చితంగా అది కొంచెం ఒత్తిడి ఉంటుంది. అయితే, కొద్దిగా ఒత్తిడి ఉంటేనే మ‌రింత బాగా ప‌నిచేస్తార‌ని అంటారు. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని నటించాన‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement