Thursday, November 21, 2024

డ్రైవ‌ర్ నిర్లక్ష్యంతోనే అర‌కులోయ‌లో బ‌స్సు బోల్తా…

విశాఖ‌ప‌ట్నం – అర‌కు లోయ‌లో జ‌రిగిన ప్ర‌మాదానికి డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని అధికారులు తేల్చారు.. ఈ ప్ర‌మాదంపై ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపిన అనకాపల్లి ఆర్టీవో రవీంద్రనాథ్ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.. బ్రేకులు, బస్సు కండీషన్‌ సరిగానే ఉందని పేర్కొన్నారు. డ్రైవర్‌ బాగా అలసిపోవడం, నిద్రమత్తు వల్ల డ్రైవర్‌ బస్సు వేగాన్ని కంట్రోల్‌ చేయలేకపోయాడని, మలుపును అంచనా వేయలేకపోయాడని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సును గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు తెలుస్తోందని తెలిపారు. అయితే ఘటనపై డ్రైవర్‌ శ్రీశైలం మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో 20 కిలోమీటర్ల వేగంలోనే బస్సు ఉందని పేర్కొన్నారు. బస్సు అదుపు తప్పిందని గమనించిన వెంటనే అప్రమత్తం చేశానని తెలిపాడు. ఒకేసారి అందరి అరుపులు, కేకలు వేయడంతో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పాడు. చెట్టు అడ్డుగా లేకపోతే అందరూ చనిపోయేవారమని, ఘాట్‌రోడ్డులో ప్రయాణానికి ఒత్తిడి తెచ్చానన్నది సరికాదన్నాడు. త్వరగా విశాఖపట్నానికి చేరుకోవాలన్నది ప్రయాణికులేనని చెప్పాడు. కాగా, . అరకు ఘటనపై విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రులు ఆళ్లనాని, అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌, డీటీసీ, పాడేరు సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. గ‌త రాత్రి అర‌కు స‌మీపంలోని డముకు ఘాట్ రోడ్డు లో హైద‌రాబాద్ కు చెందిని ప్రైవేట్ టూరిస్ట్ బ‌స్సు అదుపు త‌ప్పి లోయ‌ల‌కు ప‌డిపోయింది.. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మ‌ర‌ణించారు.. మ‌రో 16 మంది సురక్షితంగా బయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement