Friday, November 22, 2024

ప‌చ్చ‌రాళ్ళ మైనింగ్ లో ప్ర‌మాదం – 70మంది గ‌ల్లంతు

ప‌చ్చ‌రాళ్ల మైనింగ్ లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు బుర‌ద‌లో చిక్కుకుపోయార‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ సంఘ‌ట‌న మ‌య‌న్మార్ కాచిన్ రాష్ట్రం హ్ప‌కాంత్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్ర‌మాద స‌మాచారంతో అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గ‌ల్లంత‌యిన వారి కోసం గాలిస్తున్నారు. కాగా 70మంది గ‌ల్లంత‌యిన‌ట్లు తెలిపారు.లారీల నుంచి ఉపరితల గనుల్లో వేసిన శిథిలాలు ఓవర్‌ఫ్లో గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు స‌మాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప‌చ్చ‌రాళ్ల గనులకు ప్రపంచంలో మయన్నామర్ ప్రసిద్ది చెందింది.

కానీ ఇక్కడి గనులలో చాలా ఏళ్లుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హ్పకాంత్‌ ప్రాంతంలో జాడే మైనింగ్‌పై నిషేధం విధించారు. అయితే సరైన ఉపాధి లేకపోవడంతో, కోవిడ్-19 పరిస్థితుల వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు తరుచూ నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే మైనింగ్ చేసేవారికి సరైన నైపుణ్యం లేకపోవడం, కొండచరియలు విరిగిపడటం, ఇతర ప్రమాదాల కారణంగా నిత్యం అనేక మంది ప్రాణాలు కోల్పుతున్నారు. కాచిన్ రాష్ట్రంలో జాడే మైనింగ్ చేస్తున్న సమయంలో.. 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మృతిచెందారు. ఇక, 2020లో చోటుచేసుకున్న ప్రమాదంలో 160 మందికి పైగా మృతిచెందారు. వీరిలో ఎక్కువ మంది వలస వచ్చినవారే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement