Monday, November 25, 2024

హౌసింగ్‌కు అచ్చేదిన్‌ .. 2022లో ధరలు 5 శాతం పెరిగే ఛాన్స్‌

న్యూఢిల్లీ : వచ్చే 2022లో ఇళ్ల ధరలు 5 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని, డిమాండ్‌ పెరగనుండడమే ఇందుకు కారణమని ప్రొపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా రిపోర్ట్‌ పేర్కొంది. ఈ మేరకు 2022 ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. కరోనా మహమ్మారి ప్రభావంతో 2021లో హౌసింగ్‌ మార్కెట్‌ అనిశ్చితికి గురైంది. అయితే 2022 ఇటు కమర్షియల్‌, అటు రెసిడెన్సియల్‌ సెెక్టార్లు స్థిరమవ్వబోతున్నాయని రిపోర్ట్‌ అంచనా వేసింది. హౌసింగ్‌ సెగ్మెంట్‌ పరంగా చూస్తే ఇళ్ల విక్రయాలు 2022లో కొనసాగనున్నాయని రిపోర్ట్‌ విశ్లేషించింది. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలు ఉన్న ఇళ్ల కొనుగోలుకు కొనుగోలుదార్లు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆకర్షణీయమైన ధరల్లో డీల్స్‌ జరగనున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా రిపోర్ట్‌ పేర్కొంది.

నిర్మాణాత్మక సంస్కరణల తర్వాత ఊపు
గత దశాబ్దకాలంగానోట్ల రద్దు, జీఎస్ట, రెరా వంటి నిర్మాణాత్మక సంస్కరణల తర్వాత కరోనా మహమ్మారి రూపంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పెద్ద దెబ్బతిన్నదని నైట్‌ ఫ్రాంక్‌ రిపోర్ట్‌ ప్రస్తావించింది. 2011-2021 మధ్య దశాబ్ద కాలంపాటు ఎన్నో విశ్లేషణ సంస్థగా నైట్‌ ఫ్రాంక్‌ పలు విషయాలను గుర్తించింది. డిమాండ్‌, సప్లయికి సంబంధించిన కారణాల వల్ల గృహాల ధరలు పెరగడం గమనించామని, వచ్చే 2022లో ఇళ్ల ధరలు 5 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయని రిపోర్ట్‌ పేర్కొంది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర బైజల్‌ స్పందిస్తూ.. 2021లో కరోనా ప్రభావం చూపించినా రియల్‌ ఎస్టేట్‌ రంగం చక్కటి రికవరీని నమోదు చేసిందని అన్నారు. రెసిడెన్సియల్‌తోపాటు ఇతర సెగ్మెంట్లు రాణించాయని ఆయన చెప్పారు. తదుపరి రెండు మూడు త్రైమాసికాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దృఢంగా కోలుకుంటుందని శిశిర్‌ బైజల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో నియామకాలు జరుపుతుండడంతో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ పెరుగుతోందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement