Saturday, November 23, 2024

ఈటల భూ కబ్జా కేసు.. తీగ లాగుతున్న ఏబీసీ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా కేసు విచారణను ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా సోమవారం మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. కార్యాలయంలోని పాత రికార్డులను అధికారులు పరీశీలించారు.  

ఈటల రాజేందర్‌పై భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసిఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తోపాటు నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీ నియమించి త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అధికారులు ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న జమున హెచరీస్ భూముల్లోకి అక్రమంగా వెళ్లి విచారణ జరిపారు. దీంతో ఈటల రాజేందర్ కుటుంబసభ్యులు హైకోర్టును కోర్టు ఆశ్రయించడంతో అధికారులకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణపై స్టే ఇచ్చి నిలిపివేసింది. 15 రోజుల నోటిసులు ఇచ్చి విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ఈటల కేసులో నోటిసులు ఇచ్చి నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే నేడు మాసాయిపేటలో పర్యటించి ప్రాధమిక విచారణ చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్, విజిలెన్స్ అధికారులు వచ్చారు.

ఈట‌ల రాజేంద‌ర్ భూక‌బ్జాపై ద‌ర్యాప్తు ముమ్మ‌రంగా కొన‌సాగుతోంద‌ని మెద‌క్ జాయింట్ క‌లెక్ట‌ర్ ర‌మేశ్ తెలిపారు. 2018లో అనుమ‌తులు లేకుండా జ‌మున హ్యాచ‌రీస్ ప్లాంట్ నిర్మాణం చేప‌ట్టారు. 2018లో అచ్చంపేట‌లోని స‌ర్వే నెం.55తో పాటు స‌ర్వే నెం 123 నుంచి 129 వ‌ర‌కు లే అవుట్ కోసం అప్ప‌టి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిపై ఒత్తిడి తీసుకొచ్చి సంత‌కం చేయించుకున్నారు. 2019లో స‌ర్వే నెం. 130లోని భూమిని కూడా నాటి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిని బ‌ల‌వంతం పెట్టి సంత‌కాలు తీసుకున్నారు. ఆ ఇద్ద‌రి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల వాంగ్మూలాన్ని ఇవాళ మాసాయిపేట త‌హ‌సీల్దార్ మాల‌తి స‌మ‌క్షంలో రికార్డు చేశామ‌ని తెలిపారు. స‌ర్వే నెం. 111లో ఎలాంటి అనుమ‌తి లేకుండా ఫీడ్ ప్లాంట్ నిర్మాణం చేప‌ట్టారని చెప్పారు. జ‌మున హ్యాచ‌రీస్ భూముల‌పై డీపీవో ఆధ్వ‌ర్యంలో స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. విచార‌ణ త‌దుప‌రి అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జేసీ ర‌మేశ్ పేర్కొన్నారు.

మరోవైపు తన ఆస్తులు తన చెమట చుక్కలతో సాంపాదించానని, తన ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇప్పటికే ఈటల డిమాండ్ చేశారు. తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని, సన్యాసం కూడా పుచ్చుకుంటానని ప్రకటించారు.  తాను ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. ఈ చిల్లర రాజకీయాలకు ఈటల రాజేందర్ లొంగిపోడన్నారు. తాను తీసుకున్న భూముల చుట్టూ అసైన్డ్ భూములున్న విషయాన్ని సీఎంకు కూడా చెప్పానని తెలిపారు. అసైన్డ్ భూములు అమ్మవద్దని, కొనవద్దని తానే రైతులకు చెప్పానని పేర్కొన్నారు. రైతులే భూములను ప్రభుత్వానికి సరండర్ చేస్తూ లేఖలు ఇచ్చారని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మంత్రి ఈటల సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement