తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు చేపట్టిన సంగతి తెలిసిందే. 30మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ పర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ని ఏసీబీ డీజీగా నియమించారు. ఈ మేరకు అంజనీ కుమార్ అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ గా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలో ఉన్న గోవింగ్ సింగ్ నుంచి అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడానికి తన వంతు కృషి చేస్తానని అంజనీకుమార్ తెలిపారు.
ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. అవినీతి నిరోధక శాఖలో పని చేసే అందరూ ఆఫీసర్లు నిబద్దతతో పని చేయాలన్నారు. ఇంత వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు మూడేళ్ల పాటు కమిషనర్‌గా పని చేశానని .. ఆ బాధ్యతలు సంతృప్తినిచ్చాయన్నారు. కరోనా సమయంలో ఆ విధులు విజయవంతంగా నిర్వర్తించానని .. తనకు అందరి నుంచి పూర్తి సహకారం లభించిందని తెలిపారు. తనతో పాటు పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. . తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారని, దీనిని నిలబెట్టుకుంటానని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital