వీసా లేకుండా ఓన్లీ పాస్‌పోర్ట్ ఉంటేనే పలు దేశాలకు జర్నీ చేయొచ్చు. ఇట్లాంటి అంశాలను బేస్ చేసుకుని ప్రపంచ దేశాల్లో ఏ దేశ పాస్‌పోర్టుకు ఎక్కువ దేశాల్లో ప్రయాణించే సౌలతు ఉందన్నదానిపై ఇండెక్స్ రూపొందిస్తారు. దీన్నే హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ అని పేర్కొంటారు. మరి ఈ సారి ఏ కంట్రీకి చెందిన పాస్పోర్టుతో ఎక్కువ దేశాల్లో తిరిగేందుకు అవకాశం ఉంది.. ఇండియా పాస్పోర్టుతో ఎన్ని దేశాలకు వెళ్లొచ్చో తెలుసుకుందాం..
2022వ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాకు సంబంధించిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ విడుదలైంది. తాజా జాబితాలో జపాన్, సింగపూర్ ఫస్ట్ ర్యాంకులో నిలిస్తే.. భారత్ మాత్రం 83వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే గతేడాదితో పోలిస్తే ఇండియన్ పాస్‌పోర్టు 7 స్థానాలు బెటర్మెంట్ సాధించిందనే చెప్పొచ్చు. భారత పాస్పోర్టుతో ముందస్తు వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లే వెసులుబాటు ఉంది. అదే 2021లో ఇది కేవలం 58 దేశాలకు మాత్రమే పరిమితమితంగా ఉండేది. ఈసారి ఒమన్, అర్మేనియా దేశాలు అదనంగా ఈ జాబితాలో చేరాయి.
జపాన్, సింగపూర్ పాస్‌పోర్టులతో 192 దేశాలకు..
జపాన్, సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్నవాళ్లు ప్రపంచవ్యాప్తంగా వీసా అవసరం లేకుండా 192 దేశాలకు జర్నీ చేయొచ్చు. ఈ జాబితాలో అఫ్ఘనిస్థాన్ (166) అట్టడుగున నిలిచింది. అప్ఘాన్ పాస్పోర్టుతో వీసా లేకుండా 26 దేశాలకే వెళ్లే వెసులుబాటు ఉంది. పాకిస్థాన్ మాత్రం 108వ స్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్పోర్టుతో 31 దేశాలకు వెళ్లే చాన్స్ ఉంది.
17 ఏళ్లుగా జాబితా..
టూరిస్ట్ వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను హెన్లీ ఇండెక్స్ రూపొందించింది. గత 17 ఏళ్లుగా హెన్లీ ఇలా యేటా పాస్‌పోర్టుల జాబితాను విడుదల చేస్తోంది.