Monday, November 18, 2024

ABP-C Voter Survey: యూపీలో అధికారం ఆపార్టీదే.. తేల్చేసిన ఏబీపీ సర్వే!

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా ఈ ఎన్నికలకు సెమీఫైనల్ గా 5 రాష్ట్రాల ఎన్నికలను భావిస్తున్నారు. 5 రాష్ట్రల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. గోవా, మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అందరి దృష్టి మాత్రం ఉత్తర్ ప్రదేశ్ పైనే ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందని అన్నది ఆసక్తి రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ, బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో గెలుపు కోసం అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి. అయితే, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందా? లేక అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ వస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏబీపీసీ ఓటర్ సర్వే అంచనా వేసింది. గతంతో పోలిస్తే ఈసారి 100 సీట్ల వరకు బీజేపీకి తగ్గుతాయని తెలిపింది. 2017లో బీజేపీకి 312 స్థానాలు రాగా.. ఈసారి 223-235 సీట్లు వస్తాయని అంచానా వేసింది. ఎస్పీకి 145-157 స్థానాలు, బీఎస్పీకి 8-16, కాంగ్రెస్ పార్టీకి 3-7 సీట్లు వస్తాయని పేర్కొంది.

ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదని ఈ సర్వే తేల్చింది. గత ఏడాది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో చాలా కష్టపడుతున్నారు. అయితే, ఫలితం మాత్రం కనిపించలేదని స్పష్టమవుతోంది. ABP-C ఓటర్ సర్వేలో కాంగ్రెస్ కు కేలవం 3 నుండి 7 సీట్ల మాత్రమే వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 4 నుండి 8 వరకు కైవసం చేసుకుంటారని పేర్కొనడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement