కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ.. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి ఉచితంగా టీకా అందించనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. కొవిడ్ నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాని నిర్ణయం ఉపకరిస్తుంద నీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారీ వ్యాక్సినేషన్ ద్వారా వైరస్‌కు అడ్డుకట్ట వేయవచ్చు పేర్కొన్నారు. 18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి అనుమతించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం యోగి కృతజ్ఞతలు తెలిపారు.