Friday, November 22, 2024

APP: పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపిక.. ఆప్ పిలుపుకు 8 లక్షల మంది స్పందన

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిలో మీకు నచ్చిన వారికి ఓటు వేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తోంది. మొదటి 24 గంటల్లోనే 8 లక్షల మందికి పైగా స్పందించారు. పార్టీ పేర్కొన్న అభ్యర్థుల్లో తమ ఓటు ఎవరికో తెలిపారు.

‘జనతా చునేగి ఆప్నా సీఎం’ పేరుతో ఆప్ ఒక సర్వే నిర్వహిస్తోంది. వాట్సాప్ సందేశాల ద్వారా 3 లక్షల మందికి పైగా అభిప్రాయాలు తెలియజేశారు. నాలుగు లక్షలకు పైగా ఫోన్ కాల్స్, 50,000 మందికి పైగా మెస్సే జ్ లు పంపించారు. ఒక లక్షకు పైగా వాయిస్ మెస్సేజీల రూపంలో సీఎంగా ఎవరు తమకు సమ్మతమని తెలియజేశారు. ఈ మేరకు వివరాలను ఆప్ నేత హర్పాల్ సింగ్ చీమా వెల్లడించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకే కల్పించడం ఇదే మొదటిసారి.  అందరి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు. జనవరి 17 సాయంత్రం 5 గంటల వరకు తమ అభిప్రాయాలను పంజాబ్ ప్రజలు తెలియజేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement