కరోనా సమయంలో వినోదాన్ని ఆస్వాదించేందుకు ఓటీటీలని ఆశ్రయించారు ప్రేక్షకులు. దాంతో పలు కొత్తగా ఓటీటీలు పుట్టుకొచ్చాయి. కాగా తెలుగు ఓటీటీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారు. ఆహా పేరుతో దూసుకుపోతోన్న ఈ ఓటీటీ తన ప్రసార సామ్రాజ్యాన్ని పలు భాషల్లోకి విస్తరిస్తోంది.ఈ మేరకు తమ కార్యక్రమాలను తమిళంలోకీ విస్తరింప చేయాలని గత కొంతకాలంగా అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ యేడాది ఫిబ్రవరిలో లోగో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నయ్ లో జరిపారు. గురువారం తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని నూరు శాతం తమిళ ఓటీటీ గా ఆహా ప్రసారాలను మొదలెట్టబోతున్నారు. సీఎం స్టాలిన్ చేతుల మీదుగా గురువారం సాయంత్రం చెన్నయ్ లీలా ప్యాలెస్ లో జరుగుబోతోంది. రాబోయే రోజుల్లో తమిళ చిత్రాలతో పాటు ఇతర భాషల నుండి అనువదించిన సినిమాలను, వెబ్ సీరిస్ లను, ఓటీటీ మూవీస్ ను కూడా తమిళ ఆహాలో ప్రసారం చేయబోతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement