Monday, November 18, 2024

రాహుల్​ గాంధీతో కలిసి నడిచిన శివసేన లీడర్​.. భారత్​ జోడో పాదయాత్రలో పాల్గొన్న ఆదిత్య థాకరే

కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర 65వ రోజుకు చేరుకుంది. ఇవ్వాల (శుక్రవారం) మహారాష్ట్ర హింగోలిలోని కలమ్నూరిలో రాహుల్​ పాదయాత్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే పాల్గొన్నారు. దారిలో ప్రజలకు చేతులు ఊపుతూ ఈ ఇద్దరు నేతలు పక్కపక్కనే నడిచారు. ఇక.. శివసేన మరో నేత, రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అంబాదాస్ దాన్వే, మాజీ ఎమ్మెల్యే సచిన్ అహిర్ కూడా పాదయాత్రలో ఆదిత్య ఠాక్రేతో కలిసి పాల్గొన్నారు.  

ఇక.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కూడా మహారాష్ట్రలో సాగే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్​ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. దీంతో విభిన్న సిద్ధాంతాలతో ఉన్న రెండు పార్టీలు.. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని అంగీకరించిన సాన్నిహిత్యాన్ని సూచిస్తుందని విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తారు.  ఇక.. రాహుల్ గాంధీ తలపెట్టిన ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలకు సంఘీభావంగా నిలవాలనే వారు ఎవరైనా తమతో చేరవచ్చని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement