Friday, November 22, 2024

కేంద్రం కీలక ప్రకటన.. ఇకపై ఆధార్ కార్డు లేకపోయినా వ్యాక్సిన్

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. మరోవైపు టీకా నమోదుకు అవసరమైన ఫోటోగుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు లేకపోతే ఉపయోగించగల అనేక ఇతర పత్రాలు ఉన్నాయి. టీకా నమోదుకు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్డు, పెన్షన్ పత్రాలు కూడా చెల్లుతాయి. ఈ మేరకు వాటిలో ఏదైనా పత్రాన్ని చూపించి కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement