ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువును పెంచింది. ఈ నెల 14తో ముగిసిన ఈ గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం మార్చి 15 నుంచి ఆధార్‌లో ఉచితంగా వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు జూన్ 14 వరకు గడువు ఇచ్చింది. ఇప్పుడు ఈ గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌లో వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అప్‌డేట్‌ను మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement