వధువును ఎత్తుకెళ్లి.. ఎడారిలో పెళ్లి చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో ఈ ఘటన జరిగింది. ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. జూన్ 12న వివాహం చేయటానికి ఇరు వైపుల పెద్దలు ముహూర్తం కూడా నిశ్చయించారు. ఈ క్రమంలో ఆమెను కొంతమంది గూండాలు వచ్చి ఎత్తుకుపోయారు. వారిలో ఉపేంద్ర అనే వ్యక్తి ఆమెను ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మంట వేసి ఆమెను ఎత్తుకుని మంట చుట్టు ఏడు అడుగులు వేశాడు.
ఆమె నన్ను వదులు అంటూ ఎంతగా ఏడుస్తున్నా పట్టించుకోలేదు. అలా ఆమెను ఎత్తుకుని మంట చుట్టు ఏడు అడుగులు వేసి..ఇక మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నువ్వు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అంటూ హెచ్చరించాడు.ఆ తరువాత ఆమెను వదిలేశాడు.
- Advertisement -