దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. కరోనా తోపాటు.. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071 ఒమిక్రాన్ నమోదయ్యాయి. అందులో ఇప్పటికే 1,203 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 381 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో 513 , కర్నాటకలో 333, రాజస్థాన్ లో 291, కేరళలో 284, గుజరాత్ లో 204 కేసులు నమోదు అయ్యాయి. 123 ఒమిక్రాన్ కేసులతో తెలంగాణలో ఏడో స్థానంలో ఉంది. తమిళనాడులో 121, హర్యానాలో 114, ఒడిశాలో 60, పీలో 31, ఆంధ్రప్రదేశ్ లో 28, వెస్ట్ బెంగాల్ లో 27 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. గోవాలో 19, అస్సామ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 9 కేసులు చొప్పున, మేఘాలయలో 8, ఛండీగఢ్, అండమాన్ దీవుల్లో మూడు కేసులు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో రెండు కేసులు, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, లఢాఖ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కో కేసులు నమోదు అయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..