Saturday, November 23, 2024

‘కరోనా దేవి’ ఆలయం.. ప్రత్యేక ఏంటో తెలుసా?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ తరుణంలో కరోనా ఎప్పుడు పోతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. కరోనాకి విరుగుడు త్వరగా వస్తే బావుండునని దేవుడిని నమ్మేవారంతా ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా కరోనా దేవికే పూజలు చేస్తున్నారు. అవును మీరు చదివింది కరెక్ట్. కరోనాకి ఓ ఆలయం కట్టి పూజలు చేసి.. అమ్మా కరోనా తల్లీ నీకు పుణ్యం ఉంటుంది.. వెళ్లిపోవమ్మా అని ప్రార్ధనలు చేస్తున్నారు. ఏకంగా ‘కరోనా దేవి’ అని పేరుపెట్టి గుడి కట్టి పూజలు చేస్తున్నారు.

కొవిడ్​ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలంటూ తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో ‘కరోనా దేవి’ ఆలయం నిర్మించారు. 48 రోజుల పాటు ఈ పూజలు చేస్తారు. ఈ విషయాన్ని ఆ ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోయంబత్తూరు శివారులోని ఇరుగూరులో కరోనా దేవి ఆలయం ఇటీవల వెలిసింది. గతంలో ప్లేగు వ్యాధి నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని మారియమ్మన్ ఆలయాన్ని నిర్మించారు. కామాక్షిపురి ఆధినం శక్తిపీఠం శివలింగేశ్వర స్వామిగళ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వహకులు చెప్పారు.

 కామట్చిపురి అధినం ఆధ్వర్యంలో ఈ గుడిని ఏర్పాటు చేశారు. కరోనా దేవికి 1.5 అడుగుల నల్లరాతి విగ్రహం చేయించారు. దీన్ని ఆ మఠం పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు. కరోనా దేవికి నిష్టగా 48 రోజుల పాటు ప్రార్ధనలు చేస్తే.. ఈ తల్లి కరుణించి వెళ్ళిపోతుందని ఆశిస్తున్నట్టు నిర్వాహకులు అంటున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని వేడుకుంటూ ఈ ఆలయంలో పూజలు నిర్వహించినట్లు కమాట్చిపురి అధినంకు చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి చెప్పారు. గతంలో కలరా కారణంగా అనేక మంది ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తారనే నమ్మకంతో… మరియమ్మన్, మకాలి అమ్మన్, కరుమరియమ్మన్ దేవతలను పూజించినట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో ప్రస్తుతం మహమ్మారి నుంచి దేశ ప్రజలు బయటపడాలని వేడుకుంటూ 48 రోజుల పాటు పూజలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement