హర్యానా రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదైందని సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం ఝజ్జర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన ఆస్థి, ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు చెప్పారు.
హర్యానాలో స్వల్ప భూకంపం
Advertisement
తాజా వార్తలు
Advertisement