హెదరాబాద్, ఆంధ్రప్రభ : సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తూ వంటగ్యాస్ ధరలను ఆవాశానికి చేర్చిన కేంద్ర ప్రభుత్వం పేదలపై మరో పిడుగు మోపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం, పెరిగిన ద్రవ్యోల్భణంతో సామాన్యుడి బడ్జెట్ గాడి తప్పుతుండగా, కేంద్ర నిర్ణయంతో పేదల నట్టిట్ల్లో వంటనూనె ధరలు మండిపోనున్నాయి. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన పామాయిల్ ధరలు మరోసారి పెరిగేందుకు కేంద్ర నిర్ణయం కారణం కానుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది.
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది గతేడాది కాలంగా ఆహార ద్రవ్యోల్భణంతో అత్యధికంగా నమోదైన వంట నూనెల ధరలు సామాన్యుడికి కొంత కాలంగా దిగొచ్చిన ధరలు ఇప్పుడు మళ్లిd పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగిరావడంతో గత కొంత కాలం క్రితం భారీగా ఉన్న వంట నూనె ధర తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాండెడ్ పామాయిల్, న్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ ధరలు తగ్గాయి. గడచిన మే నెలలో వంట నూనెలు, ఫ్యాట్ క్యాటగిరీల ద్రవ్యోల్భణం 13.26శాతం పెరగ్గా, ఆ మేరకు ధరలు తగ్గాయి.
కాగా ఇప్పుడు మరోసారి సామాన్యులకు మళ్లిd షాక్ తగలనుంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన వంటనూనె ధరలు మళ్లిd పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. గతంలో లీటర్ వంటనూనె రూ.200 దాటగా అప్రమత్తమైన కేంద్రం తగుచర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ రూ.140నుంచి రూ. 150కి లభిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయిల్ దిగుమతి సుంకాలు పెంచడంతో ఆ భారం వినియోగదారులపైనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముడి పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో ధరల నియంత్రణలో భాగంగా ముడి పామాయిల్‌పై దిగుమతి ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఆయిల్ దిగుమతి సుంకాలను పెంచడంతో త్వరలో వంటనూనెల ధరలు పెరగనున్నాయి. ఆయిల్ సీడ్ ధరలు తగ్గడంతో రైతులను ఆదుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తోంది. దేశీయంగా రైతులకు ప్రోత్స#హంచడానికి క్రూడ్ పామ్ ఆయిల్‌కు, ఆర్‌బీడీ మధ్య సుంకం వ్యత్యాసం 12 నుంచి 13 శాతం వరకు ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ప్రస్తుతం భారత్ అధిక మొత్తంలో ఆయిల్‌ను రష్యా, ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే ఆయా దేశాల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడం, అలాగే డిమాండ్ పెరిగిపోవడం వంటి అంశాల కారణంగా కూడా వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇండోనేషియా దిగుమతులను నిషేదించడంతో దేవీయంగా నూనెల ధరలు పెరిగాయి. వంటనూనెలే కాకుండా పామాయిల్ వాడే పలు రకాల ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. సబ్బులు, షాంపులు, నూడుల్స్, బిస్క్ట్లు, చాక్లెట్లలో పామాయిల్ వినియోగస్తారు.