Friday, November 22, 2024

Google | గూగుల్‌కు షాక్‌.. ఫైన్ విష‌యంలో సీసీఐ నిర్ణయాన్ని ఆమోదించిన ఎన్‌సీఎల్‌ఏటీ

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌కు గట్టి షాక్‌ తగిలింది. గుగూల్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విధించిన ఫైన్‌ను నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆమోదించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గూగుల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా భారీ జరిమానా విధించింది. దీనిపై గూగుల్‌ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)ని ఆశ్రయించింది. దీనిపై విచారించిన ట్రి బ్యూనల్‌ ఛైర్మన్‌ అశోక్‌ భూషణ్‌, సభ్యుడు అశోక్‌ శ్రీవాస్తవ దీనిపై తీర్పు వెలువరించారు.

జరిమానా విధించడం సహాజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా లేదని, జరిమానా 1337.76 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలని గూగుల్‌ను ఆదేశించింది. గూగుల్‌పై గత సంవత్సరం అక్టోబర్‌ 20న సీసీఐ భారీ జరిమానా విధించడంతో పాటు, అనైతిక వ్యాపార పద్ధతులు మానుకోవాలని, ప్రవర్తన మార్చుకోవాని ఆదేశించింది. మొబైల్‌ స్మార్ట్‌ ఫోన్లలో యాప్స్‌, ప్రోగ్రామ్‌ను రన్‌ చేసేందుకు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) అవసరం. 2005లో అండ్రాయిడ్‌ను గూగుల్‌ కొనుగోలు చేసింది. అండ్రాయిడ్‌ ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను డెవలప్‌ చేసింది. 2008లో అండ్రాయిడ్‌ పబ్లిక్‌ వెర్షన్‌ లాంచ్‌ అయ్యింది.

ఈ కేసులో గూగుల్‌ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఫైన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం అంగీకరించలేదు. చివరకు ఈ కేసు ఎన్సీఎల్‌టీ తుది తీర్పు వెలువరించంది. స్టే ఇవ్వడానికి సుప్రీం, ఎన్‌సీఎల్‌ఏటీ అంగీకరించకపోవడంతో జరిమనాలో 10 శాతం తక్షణమే డిపాజిట్‌ చేయాలని అక్టోబర్‌లో సీసీఐ లో ఆదేశించింది. ప్లే స్టోర్‌ విధానంలో గుత్తాధిత్యంపై కూడా గూగుల్‌పై సీసీఐ 936.44 కోట్ల జరిమానా విధించింది. దీనిపై కూడా గూగుల్‌ ఎన్‌సీఎల్‌టీని, అటు తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత సంవత్సరం జనవరి 17న సుప్రీం కోర్టు దీనిపై విచారణ సందర్భంగా గూగుల్‌ ఇదే విధానాన్ని యూరోపియన్‌ యూనియన్‌లోనూ అమలు చేస్తున్నదా అని ప్రశ్నించింది. గుగూల్‌ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్స్‌లో ముందుగానే కొన్ని యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తుందా అని ప్రశ్నించింది. దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఎన్సీఎల్‌టీ తాజా నిర్ణయంపై గూగుల్‌ ఇంకా స్పందించలేదు. తాము ఇండియాలో డిజిటల్‌ ట్రాన్స్‌మిషన్‌కు ఎంతగానే సహకరిస్తున్నామని గతంలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement